వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒమాహాలోని వెస్ట్రోడ్స్ మాల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయపడింది. శనివారం మధ్యాహ్నం మాల్ మొదటి అంతస్థులోని కాల్పులు జరిగాయని, అనంతరం దుండగుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. తుపాకీ గాయాలతో వ్యక్తి మరణించాడని, మరొకరికి బుల్లెట్ గాయాలు కాగా.. చికిత్స పొందుతున్నట్లు ఒమాహా పోలీసులు పేర్కొన్నారు.
ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో మాల్లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఒమాహా నగరంలో నెల రోజుల్లో కాల్పులు జరగడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట ఇండియానాలో ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ఆఫీస్ వద్ద జరిగిన సైతం కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఎనిమిది మృత్యువాతపడ్డారు.
Shooting Incident at Westroads Mall. One victim was transported to the hospital with critical injuries. Suspects fled the scene and are at large. OPD is searching the entire mall as a precaution. Please avoid the area. A press release will be sent later with more information.
— Omaha Police Dept (@OmahaPolice) April 17, 2021
ఇవి కూడా చదవండి..