నదిలో చిక్కుకుపోయిన 150 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
గండక్ నదిలో చిక్కుకుపోయిన 150 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ | ఉత్తరప్రదేశ్‌లో కుషినగర్‌లోని గండక్ నదిలో పడవలో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, విజయవంతంగా రక్షించినట్లు ఎన్డీఆర్ఎప్ డీజీ సత్యనారాయణన్ తెలిపారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కుషినగర్‌లోని నారాయణి నదిలో పడవలో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, విజయవంతంగా రక్షించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యనారాయణన్ తెలిపారు. నదిలో ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఓ పడవ చిక్కుకుపోయింది. ఇందులో సుమారు 150 మంది వరకు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే గోరఖ్‌పూర్ నుంచి ఓ బృందాన్ని పంపారు. శుక్రవారం తెల్లవారు 2.20 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ చిక్కుకున్న చోటుకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించి కాపాడినట్లు డీజీ తెలిపారు.
పడవ ఇరుక్కుపోయిన తర్వాత నది ప్రవాహంలో మూడు కిలోమీటర్ల వరకు అమావా దిగర్ వైపునకు వెళ్లిందని పేర్కొన్నారు. జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు ఎస్పీ సైతం సహాయక చర్యలను పర్యవేక్షించారు. పడవలో చిక్కుకున్న వారంతా నదికి అవతలి వైపు ఉన్న తమ వ్యవసాయ భూముల్లో పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. పడవలో మహిళలతో పాటు పిల్లలు ఉన్నారని ఓ స్థానికుడు చెప్పాడు. సుమారు 200 మందితో ఉన్న పడవ సమీపంలోని నారాయణి నదిలో ఇరుక్కుపోయిందని, డీజిల్.. నాలుగు పడవలను ఏర్పాటు చేసి అక్కడికి చేరుకొని స్థానికుడు రింకు కుమార్ పటేల్ తెలిపాడు.
ఎన్డీఆర్ఎఫ్ వచ్చే ముందే తాము కొందరిని రక్షించామని.. కొందరు పడవలోనే చిక్కుకుపోయారని చెప్పాడు. కుషినగర్ డీఎం రాజలింగం మాట్లాడుతూ నది మధ్యలో సుమారు 200 మంది చిక్కుకున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు సమాచారం ఇచ్చి, అందరినీ కాపాడినట్లు తెలిపారు. అయితే, నదిపై వంతెన లేకపోవడంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నామని స్థానికుడొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీస్
దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు
రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

