నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’ | రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నారు. 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో సాయం డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ.1153.50 కోట్లు జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఓ వైపు వర్షాలు కురవడంతో రైతులు వానాకాలం సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సాయం ఖాతాల్లో జమ చేస్తుండడంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు సాగు పనులను మరింత ముమ్మరం చేస్తున్నారు. రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు విడుతల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంతో పాటు సాగు పనుల్లో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
Health tips | బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్‌తో మాత్రమే కాదు.. బ్రౌన్ షుగర్తోనూ ఎన్నో లాభాలు తెలుసా..?
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

