2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం | రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 2024 నాటికి 50 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 2024 నాటికి 50 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే రోడ్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సుమారు 50 శాతం రోడ్డు ప్రమాదాలు రోడ్ ఇంజినీరింగ్ సమస్యలతో జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్రమంత్రి ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం సుమారు 1.5లక్షల మంది మరణిస్తున్నారన్నారు.
2024కు ముందు మరణాలు, ప్రమాదాలను 50శాతం తగ్గిస్తామని, ఇదే నా అంతర్గత లక్ష్యమన్నారు. దేశంలో 22లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని గడ్కరీ పేర్కొన్నారు. దీంతో రెండువేల డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తామన్న కేంద్రమంతి.. రహదారి భద్రత ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు. రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మెరుగైన వ్యవస్థను నిర్మిస్తోందని తెలిపారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నేతృత్వంలో స్వతంత్ర రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసే ప్రణాళిక సైతం ఉన్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

