దేదీప్యమాన దశ…
ఏకత్వం ముసుగులో సాగిన పరాయి ప్రాంత పాలకుల అకృత్యాల ఆధిపత్యాన్ని ధిక్కరించిన ధైర్య పరాక్రమమతడు నిరాశల నిశీధిలో ఆశల ఉషోదయమై ప్రకాశించిన వికాస విభావసుడతడు
ఏకత్వం ముసుగులో సాగిన
పరాయి ప్రాంత పాలకుల
అకృత్యాల ఆధిపత్యాన్ని
ధిక్కరించిన ధైర్య పరాక్రమమతడు
నిరాశల నిశీధిలో ఆశల ఉషోదయమై
ప్రకాశించిన వికాస విభావసుడతడు
తిమిరాన్ని తరిమేయ
ప్రాణాలను పణంగా పెట్టి
ఆమరణ నిరాహార దీక్షా దివ్యాయుధంతో
దిక్కులను దద్దరిల్లేలా చేసిన దార్శనిక దక్షుడతడు
భౌగోళిక తేజో తెలంగాణ సాధన కోసం
సమర శంఖారావమై
గర్జించిన పర్జన్యార్జునుడతడు
సబ్బండ వర్గాలను
స్వాభిమానోద్యమ వాయిద్యాలుగా
సంధించిన శౌర్య, ధైర్యయోధుడతడు…
అహింసాయుతోద్యమ పథ చరితలో
పరిమళించిన ప్రజా హృదయ పతాకమతడు
తరతరాల తెలంగాణోద్భవ స్వప్న
ప్రాభవాన్ని శుభారంభం చేసిన
భవ్య భాగ్య యాగ యోగమతడు
తెలంగాణ జాతి ఖ్యాతిని
చరితార్థం చేసిన
చరిత్రాత్మక తెలంగాణ జాతిపితయతడు….
స్వరాష్ట్ర సాధనానంతరం
పదేండ్ల ప్రగతి పథ పరిణత పరిపాలనతో
స్ఫూర్తిదాయకమైన తలమానికమతడు
తల్లి తెలంగాణ స్పృహలేని,
తోలుబొమ్మలనాడించే శక్తుల కుయుక్తులను
తిరస్కరిస్తున్న త్రివిక్రముడతడు
వక్రమార్గాల అధికార అక్రమార్కులను
ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చక్ర స్వప్నమతడు
వాగ్దానభంగ విఫల పరిపాలనతో విసిగి
తన పునరాగమనం కోసం తపిస్తున్న
ప్రజా వాహినిని జాగృతపరుస్తున్న
చంద్రశేఖరుడతడు.
-మంత్రి శ్రీదేవి, అధికార భాష సంఘం మాజీ అధ్యక్షురాలు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

