e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News సంగీత ద‌ర్శ‌కుడు రామ్‌ల‌క్ష్మ‌ణ్ క‌న్నుమూత‌

సంగీత ద‌ర్శ‌కుడు రామ్‌ల‌క్ష్మ‌ణ్ క‌న్నుమూత‌

సంగీత ద‌ర్శ‌కుడు రామ్‌ల‌క్ష్మ‌ణ్ క‌న్నుమూత‌

ముంబై : బాలీవుడ్ మ‌రో పెద్ద త‌ల‌కాయ‌ను కోల్పోయింది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ వంటి చిత్రాల సంగీత దర్శకుడు ల‌క్ష్మ‌ణ్‌ (78) నాగ్‌పూర్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. గుండె పోటు కార‌ణంగా చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న కుమారుడు అమ‌ర్ తెలిపారు. ఇటీవ‌ల‌నే ఆయ‌న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నార‌ని, అప్ప‌టి నుంచి చాలా నీర‌సంగా, బ‌లహీనంగా క‌నిపించార‌ని ఆయ‌న కుమారుడు చెప్పారు.

1942 సెప్టెంబ‌ర్ 16 న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు విజ‌య్ పాటిల్‌. సినిమాల్లో అవ‌కాశాలు వెతుక్కుంటున్న స‌మ‌యంలో సోద‌రుడు సురేంద్ర పాటిల్‌తో క‌లిసి రామ్‌ల‌క్ష్మ‌ణ్‌గా త‌మ పేర్లు మార్చుకున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రాలకు సంగీతం అందించిన రామ్ లక్ష్మణ్.. నాగ్‌పూర్‌లో తన కుమారుడు అమర్‌తో కలిసి నివసిస్తున్నాడు.

1975 లో సంగీత పరిశ్రమలోకి వచ్చిన విజయ్ పాటిల్, సురేంద్ర పాటిల్ 1975 లో రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీత పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘ఏజెంట్ వినోద్’ (1976) సినిమాకు సంగీతం ఇచ్చిన సురేంద్ర పాటిల్ అనారోగ్యంతో మరణించారు. అనంత‌రం విజయ్ పాటిల్ ఒక్క‌డే రామ్ లక్ష్మణ్ పేరుతో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల‌కు కూడా సంగీతం అందించారు. దాదా కొండ్కే దర్శకత్వం వహించిన ‘పాండు హవల్దార్’ (1975) సినిమాతో బాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేశారాయ‌న‌.

రామ్ లక్ష్మణ్‌కు సూర‌జ్ బ‌ర్జాత్యా సినిమా ‘మైనే ప్యార్ కియా’ నుంచి పెద్ద బ్రేక్‌ లభించింది. ఈ సినిమా పాట‌ల‌కుగాను ఆయన ఉత్తమ సంగీత కంపోజర్‌గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1999 లో వీ ఆర్ టుగెద‌ర్ ఆయ‌న చివరి సినిమా.

ల‌త‌మ్మ సంతాపం

ప్రముఖ స్వరకర్త ల‌క్ష్మ‌ణ్ మృతిప‌ట్ల గాయ‌కురాలు లతా మంగేష్కర్ త‌న సంతాపాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు, “చాలా ప్రతిభావంతులైన, ప్రసిద్ధ సంగీత స్వరకర్త రామ్ లక్ష్మణ్ జీ (విజయ్ పాటిల్) కన్నుమూసినట్లు ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ వార్త విన‌గానే చాలా బాధ ప‌డ్డాను. అతను గొప్ప వ్యక్తి. నేను చాలా పాటలు పాడాను. అవి చాలా ప్రజాదరణ పొందాయి. ఆయన మృతి ప‌ట్ల‌ నివాళులు అర్పిస్తున్నాను. ” అని రాశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

వ్యాక్సిన్ల కొరత ప్ర‌భుత్వ అల‌క్ష్యం వ‌ల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాద‌వ్‌

ఎగిరే యంత్రానికి రైట్ బ్ర‌ద‌ర్స్‌కు పేటెంట్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భార‌త్‌కు ఆహ్వానం

ఎన్నిక‌ల్లో అధిక ఖ‌ర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్య‌క్షుడిపై విచార‌ణ‌

బ్లాక్‌ ఫంగ‌స్ త‌ర్వాత‌.. ఇప్పుడు వైట్‌ ఫంగ‌స్ ఇబ్బందులు

అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు

ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవ‌చ్చు.. ఆర్‌బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంగీత ద‌ర్శ‌కుడు రామ్‌ల‌క్ష్మ‌ణ్ క‌న్నుమూత‌

ట్రెండింగ్‌

Advertisement