LSG vs RCB : ప్లే ఆఫ్స్‌లో దూసుకెళ్తున్న ఆర్సీబీ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఏడో విజయంతో టేబుల్ టాపర్ అవ్వాలనే లక్ష్యంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీ కొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ తీసుకున్నాడు. రెండే రెండు విజయాలతో అట్టడుగునున్న లక్నో భారీ మార్పులు చేసింది.
పంతొమ్మిదో సీజన్లో ఆర్సీబీ, లక్నో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌లో దూసుకెళ్తున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సో.. ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని రిషభ్ పంత్ సేన పట్టుదలతో ఉంది. అందుకని జట్టులో మూడు మార్పలు చేసింది. ఇంగ్లిస్, మొహ్సిన్ ఖాన్, అవేశ్ ఖాన్‌లను తప్పించింది.
🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @LucknowIPL in Lucknow.
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB pic.twitter.com/Z5DSxyelwt
— IndianPremierLeague (@IPL) May 7, 2026
ఆర్సీబీ తుది జట్టు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, పడిక్కల్, పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలాం, హేజిల్‌వుడ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – జోర్డాన్ కాక్స్, టిమ్ డేవిడ్, మంగేశ్ యాదవ్, వికీ ఓత్స్వల్, వెంకటేశ్ అయ్యర్.
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, పూరన్, మర్క్రమ్, పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహ్బాజ్ అహ్మద్, దిగ్వేశ్ రథీ, షమీ, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – మయాంక్ యాదవ్, ముకుల్ చౌదరీ, అబ్దుల్ సమద్, సిద్ధార్థ్, అవేశ్ ఖాన్.