అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ప్రపంచంలో అతిపెద్ద మంచుకొండను అంటార్కిటికాలో గుర్తించారు. శాస్త్రవేత్తలు దీనికి ఏ-76 అని పేరు కూడా పెట్టారు

లండన్ : ప్రపంచంలో అతిపెద్ద మంచుకొండను అంటార్కిటికాలో గుర్తించారు. శాస్త్రవేత్తలు దీనికి ఏ-76 అని పేరు కూడా పెట్టారు. ఇది పరిమాణంలో భారీగా ఉంటుంది. దీని పొడవు 170 కిలోమీటర్లు, వెడల్పు 25 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు.
ఏ-76 యొక్క వైశాల్యాన్ని ఉపగ్రహం ద్వారా కనుగొన్నారు. అంటార్కిటికాలో పనిచేసే చాలా మంది శాస్త్రవేత్తలకు కూడా దీని గురించి తెలియదంట. దీనిని గుర్తించేందుకు ఉపగ్రహ కొలత సాంకేతిక పరిజ్ఞానం సహాయం తీసుకున్నారు. అనంతరం ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద మంచుకొండగా పేర్కొన్నారు.
ఇది ఐస్‌బర్గ్ అంటార్కిటికాలోని రోనీ ఐస్ సెల్ఫ్ నుంచి వేరు చేయబడిందని, ఇప్పుడు వెడ్డెల్ సీవాల్ లో తేలియాడుతున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనిపై మరింత పరిశోధనలు చేసేందుకు ఉపక్రమించింది.
ఇది న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ కంటే పెద్దదని, ప్యూర్టో రికో దేశం మొత్తం విస్తీర్ణంలో సగానికి సమానంగా ఉంటుందని తెలుస్తన్నది. శాస్త్రవేత్తలు తెలిపిన సమాచారం ప్రకారం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికా మంచు షీట్ కరుగుతున్నందున ఈ మంచుకొండ వేరుచేయబడింది. కొద్ది రోజుల్లోనే ఈ మంచుకొండ ముక్కలుగా విడిపోతుందని వారు చెప్తున్నారు. గత ఏడాది బయటపడన ఐస్‌బర్గ్ ఏ-68ఏ కంటే పరిణామంలో పెద్దదిగా ఉన్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇటువంటి మంచుకొండలు సముద్ర జీవులకు ముప్పు కలిగిస్తాయని పరిశోధకులు నమ్ముతారు. ఇవి సముద్ర-సింహాలు, పెంగ్విన్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని వీరు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

