బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
ఒకవైపు కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ఇబ్బది పెడుతున్నది. మరోవైపు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) కూడా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది.

పాట్నా : ఒకవైపు కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ఇబ్బది పెడుతున్నది. మరోవైపు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) కూడా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. వైట్ ఫంగస్‌తో బాధపడుతున్న నాలుగు కేసులు పాట్నాలో వెలుగుచూశాయి. దాంతో వైద్యులు అప్రమత్తమై.. వైట్ ఫంగస్ మహిళలు, పిల్లల్లో చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ఎక్కువ తీవ్రమైనదే కాకుండా శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుందని వైద్యులు చెప్తున్నారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు వైట్ ఫంగస్ ప్రధాన కారణం అని, ఊపిరితిత్తులతో పాటు చర్మం, గోర్లు, నోరు లోపలి భాగం, కడుపు, ప్రేగులు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు కూడా వైట్ ఫంగస్ సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పీఎంసీహెచ్) లోని మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్ఎన్ సింగ్ ప్రకారం, ఇప్పటివరకు కొవిడ్ -19 వంటి లక్షణాలు ఉన్న నలుగురు రోగులు వైట్ ఫంగస్ బారిన పడ్డారు. రోగులలో ముగ్గురికి కరోనా టెస్ట్ రాపిడ్ యాంటిజెన్, రాపిడ్ యాంటీబాడీ, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయి. అయితే, యాంటీ ఫంగల్ మందులు ఇవ్వగా నయమయ్యారు.
స్థానిక ప్రైవేట్ దవాఖానలోని కరోనా వార్డులో చేరిన పాట్నాకు చెందిన ప్రముఖ సర్జన్ వైట్ ఫంగస్‌తో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. యాంటీ ఫంగల్ ఔషధాలతో చికిత్స అందించగా.. అతని ఆక్సిజన్ స్థాయి 95 కి చేరుకున్నదని అక్కడి వైద్యులు తెలిపారు.
కరోనా-వైట్ ఫంగస్ వేరు చేయడం కష్టం
వైట్ ఫంగస్ నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లక్షణాలు హెచ్ఆర్సీటీ లోని కరోనాను పోలి ఉంటాయి. వీటిని వేరు చేయడం కష్టం అవుతుంది. అటువంటి రోగులలో రాపిడ్ యాంటిజెన్, ఆర్టీ-పీసీఆర్ పరీక్ష పాజిటివ్‌గా వస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి లేనివారు, డయాబెటిస్తో బాధపడుతున్నవారు, యాంటీబయాటిక్ తీసుకోవడం లేదా స్టెరాయిడ్లను ఎక్కువ తీసుకోవడం వల్ల వైట్ ఫంగస్ సోకే అవకాశాలు ఉంటాయి.
నివారణకు ఏమి చేయాలి..?
వైట్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ పరికరాలు ముఖ్యంగా గొట్టాలు బ్యాక్టీరియా రహితంగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వీటిని శానిటైజ్ చేస్తుండాలి. స్ట్రెలైజ్ వాటర్‌ను మాత్రమే ఆక్సిజన్ సిలిండర్ హ్యూమిడిఫైయర్లో వాడాలి. రోగి ఊపిరితిత్తులలోకి వెళ్ళే ఆక్సిజన్‌లో ఫంగస్ లేకుండా చూడాలి.
ఇవి కూడా చదవండి..
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

