Purushaha | పురుష (Purushaha) సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా డెబ్యూ ఇస్తుడన్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని వీరు ఉలవల డైరెక్ట్ చేస్తుండగా.. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ అనౌన్స్‌మెంట్‌తో అందరి ఫోకస్‌ను తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.
ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్నో ఈ మూవీ సమ్మర్ కానుకగా వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీని మే 22న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్ కొత్త లుక్ విడుదలచేశారు. పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ మిస్ అయ్యింది..అనే క్యాప్షన్‌తో మగాళ్లు ఓ అమ్మాయి కాలికింద నలిగిపోతున్నట్టుగా ఉన్న తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ప్లాన్స్‌తో రెడీ అవుతున్నారు మేకర్స్.
మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన ప్రతీ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తూ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే పురుష్ టీం రిలీజ్ చేసిన చాటు చాటు లిరికల్ వీడియోసాంగ్తోపాటు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి పాడిన మగాళ్ల మీద జాలిపడేదెవ్వను పాటను విడుదల చేయగా సినిమాపై ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. పురుషలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఫ్రీడమ్ మిస్ అయ్యింది
Boys life becomes a full-time comedy after marriage#Purushaha releasing Worldwide On May 22! 😄🔥@kalyanb949 @MeSapthagiri @Actor_Rajkumar9 @rayancha2vk@VeeruVulavala #SatishMutyala pic.twitter.com/ojAb87O67e
— BA Raju’s Team (@baraju_SuperHit) May 7, 2026
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!