ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
ఎన్నికల్లో మంజూరు చేసిన మొత్తానికి మించి ఎక్కువ ఖర్చు చేశారని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గురువారం విచారణ జరిగింది

పారిస్: ఎన్నికల్లో మంజూరు చేసిన మొత్తానికి మించి ఎక్కువ ఖర్చు చేశారని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఇది అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీని ఇబ్బందిపెట్టిన కుంభకోణంగా భావిస్తున్నారు.
2012 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ సర్కోజీ గరిష్టంగా 2.75 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.200 కోట్లు) ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సర్కోజీ సోషలిస్ట్ అభ్యర్థి ఫ్రాంకోయిస్ హాలెండ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇలాఉండగా, తాను ఏ తప్పూ చేయలేదని సర్కోజీ ఖండిస్తున్నారు.
ఒకవేళ సర్కోజీ దోషిగా తేలితే, అతడికి ఒక ఏడాది జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, 4,580 డాలర్లు (దాదాపు రూ.3,34,000) జరిమానా విధించవచ్చు. సర్కోజీపై విచారణ మార్చిలోనే ప్రారంభమైంది. అయితే, కరోనా సోకి సర్కోజీ న్యాయవాదిని దవాఖానలో చేర్చడం వల్ల విచారణ వాయిదా పడింది. ఈ విచారణ వచ్చే నెల 22 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.
మరొక కేసులో సర్కోజీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అనేక అవినీతి కేసులు వెలువడిన అనంతరం.. 1990 నుంచి ఎన్నికల ప్రచార వ్యయం పరిమితం చేయబడింది. ఎన్నికల సమయంలో ర్యాలీలకు సర్కోజీ చాలా ఖర్చు చేశారని దర్యాప్తు అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

