జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్‌కు ఆహ్వానం
వచ్చే నెల 3, 4 తేదీలలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరుగనున్న జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశానికి ఆహ్వానం అందింది.

లండన్ : వచ్చే నెల 3, 4 తేదీలలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరుగనున్న జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ సమావేశాన్ని వర్చువల్‌గా జరుపనున్నారు. ఈ విషయాన్నిబ్రిటిష్ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. కొవిడ్-19 కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటంలో తన పాత్ర కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సమావేశం నిర్వహణ కోసం ఎంపిక చేశారు.
ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య భద్రత, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్, క్లినికల్ ట్రయల్స్, డిజిటల్ హెల్త్ తదితర అంశాలపై చర్చించనున్నారు. వారం రోజుల తర్వాత జూన్ 11-13 తేదీల్లో కార్న్‌వాల్‌లో జరుగనున్న జీ-7 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ఇక్కడ చర్చించిన అంశాలను తెలియజేస్తారు. బ్రిటన్ ప్రెసిడెన్సీ క్రింద ఈ శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది.
ఈ బృందంలో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఈ దేశాల ఆరోగ్య మంత్రులు వ్యక్తిగతంగా హాజరవుతారు. జీ-7 ప్రెసిడెన్సీకి ఆహ్వానించబడిన దేశాలతో రెండు రోజుల చర్చల్లో భారత్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పాల్గొంటాయని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
క్రికెటర్ భువనేశ్వర్ కుమార్‌కు పితృవియోగం
ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

