హైదరాబాద్ : కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ( BRS Office ) పై బీజేపీ గూండాల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ( MLC Dasoju Sravan ) తీవ్రంగా ఖండించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై వచ్చిన విమర్శలను ప్రజాస్వామ్య పద్దతిలో తిప్పికొట్టాల్సింది పోయి విజ్ఞత లేకుండా, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడమే కాకుండా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడులకు దిగడం గూండా రాజ్యంగానే చూడవలసి వస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ గూండాలు దాడిచేస్తుంటే పోలీసులు లాఠీచార్జీ చేసి దాడిని ఆపకపోగా సహకరించినట్లుగా వీడియోలు కనబడుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అనే సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడులు చేస్తుంటే కరీంనగర్లో ఉన్న ఇంటిలిజెన్స్, పోలీసులు ఏం చేస్తున్నారని పేర్కొన్నారు.