– పర్సనల్ మేనేజర్ తిరుపతికి టీబీజీకేఎస్ సూచన
రుద్రంపూర్, మే 07 : మణుగూరు ఏరియా నుండి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వచ్చిన పర్సనల్ మేనేజర్ తిరుపతిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఘనంగా సన్మానించారు. కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా విధులు నిర్వహించాలని పర్సనల్ మేనేజర్ తిరుపతిని కోరారు.
కార్మికుల పట్ల సానుకూల దృక్పథంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు వసికార్ల కిరణ్, కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, మాదాసు ఈశ్వరయ్య, ఫిట్ సెక్రటరీ సూరజ్, వెంకటేశ్వర్లు, మురళి, విద్యాసాగర్, శ్రీకాంత్, తిరుపతి, అన్వర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.