కరోనా రోగులకు ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ ఔదార్యం
కరోనా రోగులకు ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ ఔదార్యం | సాధారణంగా కరోనా రోగులను ఆటోను ఎక్కించుకునేందుకు ఆటో డ్రైవర్లు భయపడుతుంటారు.

ముంబై : సాధారణంగా కరోనా రోగులను ఆటోను ఎక్కించుకునేందుకు ఆటో డ్రైవర్లు భయపడుతుంటారు. కానీ ఆయన మాత్రం కరోనా పేషెంట్లను ఉచితంగా తీసుకెళ్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు ఆటో డ్రైవర్‌గా మారిన ఓ ఉపాధ్యాయుడు. ముంబైకి చెందిన దత్తాత్రేయ సావంత్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రోగులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నిత్యం పీపీఈ కిట్ ధరించి.. ఎప్పటికప్పుడు ఆటోను శుభ్రం చేస్తూ.. కొవిడ్ కేంద్రాలకు.. గృహాలకు రోగులను తరలిస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ముంబైలో భారీగా పెరుగుతోంది. చాలా మంది చికిత్స అందక మరణిస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో పేద రోగులకు సకాలంలో సహాయం లభిస్తుందో? లేదో?.. ప్రైవేటు అంబులెన్స్‌ల్లో ధరలు అందుబాటులో ఉండవని భావించి.. ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపాడు. కొవిడ్ రోగులను కేర్ సెంటర్లకు.. దవాఖానలకు ఉచితంగా తీసుకు వెళ్తున్నానని.. డిశ్చార్జి అయిన రోజున తిరిగి ఇండ్లకు తీసుకువస్తున్నానని చెప్పాడు. ముంబై సబర్బన్ ఘాట్కోపర్కు చెందిన దత్తాత్రేయ సావంత్ స్థానిక ధ్యాన్సాగర్ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు లేకపోవడంతో ఆటో డ్రైవర్‌గా మారి.. గత కొద్ది రోజులుగా ఈశాన్య ముంబైలో కరోనా బాధితులకు ఉచిత సేవలందిస్తున్నాడు. ఇప్పటి వరకు 26 మంది రోగులను ఉచిత రవాణా సౌకర్యం కల్పించానని, కరోనా ఉధృతి కొనసాగినంత కాలం సేవలందిస్తానని తెలిపాడు. కొవిడ్ బాధితులకు ఉచిత సేవలందిస్తున్న దత్తాత్రేయ సావంత్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయకు ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఆటోకు అవసరమైన ఇంధన ఖర్చులు భరిస్తామని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించడం విశేషం.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
తెలంగాణలో రెండు రోజులు వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన బోయింగ్
తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని
రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల
అదనపు ఆంక్షలు విధించం : ఉద్ధవ్ ఠాక్రే
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

