నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం పెద్దకాపర్తిలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ (Water Tank)కూలి తల్లీకుమారుడు మృతిచెందారు. పెద్దకాపర్తిలో బాధిత కుటుంబ సభ్యులు పెద్దకాపర్తిలో రేకుల షెడ్డుతో కొత్తగా హోటల్ ఏర్పాటు చేశారు. దానిని ఆదివారం ఉదయం ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నారు.
రాత్రి పొద్దుపోవడంతో అక్కడే పడుకున్నారు. అయితే రేకులపై బరువు ఎక్కువ కాడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను నాగమణి (32), కుమారుడు వంశీకృష్ణ (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.