బీబీనగర్, అక్టోబర్ 18 : గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ శాఖ పల్లె బాట కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఎస్ఈ ఆర్.సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ అధికారులు పల్లె బాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెరిగిన చెట్లను తొలగించారు. దీంతో పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ పి.యాదగిరి, ఏడీ మచ్చేందర్, ఏఈ మనోహర్ రెడ్డి, లైన్ మెన్ ఆర్.బాల్ నరసింహ, లుమ్ బా నాయక్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Bibinagar : విద్యుత్ అధికారుల పల్లెబాట