Rain Delay | భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 8.5 ఓవర్లకు 25/3గా ఉంది. క్రీజ్‌లో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
అంతకుముందు భారత జట్టు వరుస వికెట్లను కోల్పోయి సంక్షోభంలో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8 పరుగులు), స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (0) పెవిలియన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ రెండు వికెట్ల నష్టంతో కోలుకునేలోపే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తాజాగా ఔట్ అయ్యాడు. ఎల్లిస్ వేసిన 8.1వ ఓవర్లో లెగ్‌సైడ్ బంతిని ఆడే ప్రయత్నంలో గిల్ వికెట్ కీపర్‌కు చిక్కాడు. దీంతో భారత్ 25 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.