Shubman Gill | భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇప్పటికే ఓపెనర్ రోహిత్ శర్మ(8)తో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(0) పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు వికెట్ల పడిపోయాయి అన్న బాధనుంచి తెరుకునేలోపే భారత్‌కి మరో షాక్ తగిలింది. కెప్టెన్ శుభుమన్ గిల్ కూడా తాజాగా పెవిలియన్‌కి చేరాడు. ఎల్లిస్ వేసిన (8.1వ ఓవర్) లెగ్‌సైడ్ బంతిని ఆడేందుకు ప్రయత్నించిన గిల్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దీంతో 25 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. గిల్ స్థానంలో క్రీజులో అక్షర్ పటేల్ రాగా.. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు.