Huma Qureshi | బాలీవుడ్లో నాలుగు పదుల వయస్సు దగ్గర పడుతున్నా వివాహబంధంలోకి అడుగుపెట్టని భామల్లో టాప్‌లో ఉంటుంది హ్యుమా ఖురేషి. ఈ భామకు పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్‌తో ఎంగేజ్మెంట్కు రెడీ అయినట్టు ఇప్పటికే వార్తలు రౌండప్ చేస్తున్నాయి. తాజా ఫొటోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
రష్మిక మందన్నా థామా గ్రాండ్ ప్రీమియర్‌తోపాటు Emmay Entertainment దీపావళి పార్టీకి హాజరైంది హ్యుమా ఖురేషి. ఈవెంట్లో రచిత్ సింగ్ చేతిలో చేయి వేసి క్లోజ్‌గా కనిపించి కెమెరాలకు ఫోజులిచ్చింది. ఇక ఇన్నాళ్లుగా పుకార్లుగా వైరల్ అవుతున్న వీరిద్దరి రిలేషన్ షిప్ వార్తుల ఇప్పుడు అఫీషియల్ అయ్యాయని ఈవెంట్ స్టిల్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఎంగేజ్ మెంట్ వార్తలు కూడా నిజమేనని హింట్ ఇస్తున్నాయి.
ఇదిలా ఉంటే హ్యుమాఖురేషితో ఏడాదిగా అసోసియేట్ అవుతూ వస్తున్న రచిత్ సింగ్ కూడా ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి హ్యుమా ఖురేషి, రచిత్ సింగ్ నిజంగానే వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారా..? అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.