నిజామాబాద్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెందారు. పదో తరగతి విద్యార్థి షేక్ మూస హాస్టల్లో ఉరివేసుకుని తనువు చాలించాడు. శుక్రవారం ఆధార్ అప్డేట్ కోసం నిజామాబాద్‌లోని ఇంటికి వెళ్లిన మూస.. ఆదివారం సాయంత్రం హాస్టల్‌కు తిగివచ్చాడు. ఈ క్రమంలో రాత్రి విద్యార్థులంతా పడుకున్నాక హాస్టల్లోని రేకుల షెడ్డు రాడ్‌కు తువాలుతో ఉరి వేసుకున్నారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరాతీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.