హైదరాబాద్: సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రంలో ఒక్క వ్యాపారా కార్యకలాపాలు పూర్తిగా మూతపడ్డాయి. అదేవిధంగా విద్యాసంస్థలు తెరచుకోలేదు. కొడంగల్ మండల కేంద్రం నుంచి మెడికల్ కళాశాల, వెటర్నరీ, నర్సింగ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలలను దుద్యాల మండలానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి నిరసగా కొడగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. అదేవిధంగా కొడంగల్ మండలంలో జరుగనున్న సీఎం రేవంత్ బహిరంగ సభను బహిష్కరించాలని నిర్ణయించారు.
నేడు కొడంగల్ బంద్
కొడంగల్ మండలంలో జరిగే రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లకుండా నిరసన తెలియజేయాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు
కొడంగల్ మండల కేంద్రం నుండి మెడికల్ కళాశాల, వెటర్నరీ, నర్సింగ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలలను దుద్యాల మండలానికి తరలింపును… pic.twitter.com/mp3z8Bj8jR
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2025