ములుగురూరల్ : జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకల్లో భాగంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ల నుండి గౌరవ వందనం స్వీకరించి ప్రగతి నివేదికను తన ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు.
ఇది కూడా చదవండి..
Supreme court: ఆ వీడియో డిలీట్ చేయండి.. జర్నలిస్టుకు సుప్రీం ఆదేశం
Ram Kadam | ఆ ఇద్దరు శివసేన నేతలను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : బీజేపీ