Landslides | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి జనజీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ సహా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి.
किन्नौर में NH-5 पर नाथपा डैम के पास भीषण भूस्खलन।
चट्टानों और मलबे से भरा #डैम।#HimachalPradesh #Landslide #AnantChaturdashi #NH5 #GaneshVisarjan2025 #अनंत_चतुर्दशी pic.twitter.com/dVNvwCdFwR
— ℝ𝔸ℍ𝕌𝕃 𝕋𝕆𝕄𝔸ℝ🇮🇳⚔️क्षत्रिय ⚔️सनातनी 🚩 (@rahultomarjatt) September 6, 2025
తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా (Shimla) జిల్లాలోని రాంపూర్ సబ్‌డివిజన్‌లోని జూరి సమీపంలో బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు గాంచ్వా ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడటంతో చెట్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. సిర్మౌర్ జిల్లా నౌహ్రాధార్ సమీపంలోనూ చౌకర్ గ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 200 మీటర్ల కొండభాగం కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఆయా ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
VIDEO | Himachal Pradesh: Massive landslide near Chaukar village in Sirmaur’s Nauhradhar area, a large section of the hill collapses.
The landslide stretched nearly 200 metres; five people were present at the site and are safe. Five houses now lie in the danger zone. The region… pic.twitter.com/lZn85zousJ
— Press Trust of India (@PTI_News) September 6, 2025
Also Read..
IndiGo | అబుదాబి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. కొచ్చిలో ల్యాండింగ్
Tihar Jail | తీహార్ జైలును పరిశీలించిన బ్రిటన్ అధికారులు.. ఆర్థిక నేరగాళ్లను అప్పగిస్తారా..?
PM Modi | యూఎస్ టారిఫ్స్ వేళ భారత్ కీలక నిర్ణయం.. ఐరాస సమావేశాలకు ప్రధాని మోదీ దూరం