PM Modi | అమెరికా అధిక టారిఫ్ల వేళ (Trump Tariffs) భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు (UN General Assembly) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలకు మోదీ హాజరు కావడం లేదని తెలిసింది. ఆయనకు బదులు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) ఈ సమావేశాల్లో ప్రసంగించనున్నట్లు తాజా సమాచారం.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. హై లెవల్ డిబేట్ మాత్రం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనున్నది. చర్చలో పాల్గొనే వక్తల జాబితాను తాజాగా యూఎన్ గత నెల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్రెజిల్ చర్చను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అమెరికా మాట్లాడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన యూఎన్జీఏ పోడియం నుంచి డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని ఆ జాబితాలో ఉంది. అదే రోజున ఇజ్రాయిల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నేతలు కూడా ప్రసంగిస్తారు.
ఈ సమావేశాలకు ప్రధాని యూఎస్ వెళ్తారని అంతా భావించారు. ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్-మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే, అనూహ్యంగా ఈ సమావేశాలకు మోదీ దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read..
Upendra Dwivedi | పాక్తో యుద్ధం మూడు రోజుల్లో ముగియలేదు : ఆర్మీ చీఫ్ జనరల్
Mumbai | స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ముంబైకి బాంబు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
PM Modi | ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయం : ప్రధాని మోదీ