Upendra Dwivedi | పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terrorist attack) ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) మూడు రోజుల్లో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. ఇది ఎక్కువ కాలం కొనసాగిందన్నారు. ఆ సమయంలో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
న్యూ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే7న చేపట్టిన ఆపరేషన్ మే 10న ముగిసిందని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ ఆ యుద్ధం మూడు రోజుల్లో ముగియలేదు. చాలా కాలం కొనసాగింది. ఆ సమయంలో చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అంతకు మించిన మరిన్ని వివరాలు ఇక్కడ పంచుకోవడం కష్టం’ అని తెలిపారు.
అదేవిధంగా భారత్-పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘నియంత్రణ రేఖ వెంబడి ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అంతమైందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో, ఎంతమంది తప్పించుకున్నారో మనందరికీ తెలుసు’ అని ద్వివేది వ్యాఖ్యానించారు.
Also Read..
Mumbai | స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ముంబైకి బాంబు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
PM Modi | ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయం : ప్రధాని మోదీ
PM Modi | వరద ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ