PM Modi | రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి సహకరిస్తోందంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత్‌పై భారీ సుంకాలు విధించారు. ట్రంప్ (Donald Trump) టారిఫ్స్‌తో ఇరు దేశాల మధ్య విభేదాలు (India-US ties) నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూ ఢిల్లీపై విమర్శలు చేస్తూ వస్తున్న ట్రంప్.. తాజాగా స్వరం మార్చారు.
భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని, ప్రధాని మోదీ (PM Modi)తో స్నేహంగా ఉంటానని పేర్కొన్నారు. అంతేకాదు మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
అంతకు ముందు భారత్-అమెరికా బంధంపై ట్రంప్ ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. భారత్, రష్యాను చైనాకు చేజార్చుకున్నట్లు కనపడుతోందని వ్యాఖ్యానించారు. ఆ మూడు దేశాల భవిష్యత్తు సుసంపన్నం కావాలంటూ ఆయన వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలియచేశారు. ఇటీవల టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో మోదీ, జిన్‌పింగ్, పుతిన్ కలసి తీసుకున్న ఫొటోను ట్రంప్ షేర్ చేస్తూ.. భారత్, రష్యాను తాము చైనాకు చేజార్చుకున్నట్లు కనపడుతోందని పేర్కొన్నారు. ఆ ముగ్గురికి సుదీర్ఘ, సుసంపన్న భవిష్యత్తు ఉండాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ట్రూత్‌లో రాసిన మరో పోస్టులో ట్రంప్ చైనాపై ప్రశ్నాస్ర్తాలు సంధించారు. ఓ స్నేహరహిత విదేశీ దురాక్రమణదారుడి నుంచి స్వేచ్ఛను సాధించే క్రమంలో చైనా కోసం తన రక్తాన్ని త్యాగం చేసిన అమెరికాను చైనా ప్రస్తావిస్తుందా లేదా అన్న ప్రశ్నకు జీ జిన్‌పింగ్ నుంచి జవాబు కావాలని ట్రంప్ తెలిపారు.
Also Read..
భారత్, రష్యాను చైనాకు చేజార్చుకున్నాం!
ఇండియన్స్.. ఇక చాలు!.. అమెరికా అంతా ఇప్పటికే మీతో నిండిపోయింది!
ఇక అమెరికాలోనే మీ పెట్టుబడులు.. టెక్ జెయింట్‌లతో ట్రంప్