IndiGo | అబుదాబి (Abu Dhabi) బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య (technical snag) తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. కొచ్చి (Kochi) ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఇండిగో ఫ్లైట్ 6E 1403 శనివారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుదాబికి బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి కొచ్చి ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. విమానంలో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించింది.
Also Read..
Tihar Jail | తీహార్ జైలును పరిశీలించిన బ్రిటన్ అధికారులు.. ఆర్థిక నేరగాళ్లను అప్పగిస్తారా..?
PM Modi | యూఎస్ టారిఫ్స్ వేళ భారత్ కీలక నిర్ణయం.. ఐరాస సమావేశాలకు ప్రధాని మోదీ దూరం
Upendra Dwivedi | పాక్తో యుద్ధం మూడు రోజుల్లో ముగియలేదు : ఆర్మీ చీఫ్ జనరల్