Rayapol | రాయపోల్, జులై 07 : రాయపోల్ ఎస్ఐగా మానస సోమవారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన విక్కర్తి రఘుపతి బదిలీపై గజ్వేల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తొగుట పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహించిన మానస రాయపోల్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మానసను వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు.
ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మానస మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల కోసం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు నాయకులు. ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు