న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశీయ మార్కెట్‌కు మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే దేశీయ రోడ్లపై దూసుకుపోతున్న బొలెరోలో సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.7.99 లక్షల నుంచి రూ.9.69 లక్షల లోపు ఈ వాహన ధరలను నిర్ణయించింది. దీంట్లో రూ.7.99 లక్షల నుంచి ప్రారంభ ధరతో బొలెరో, రూ.8.49 లక్షల నుంచి రూ.9.99 లక్షల లోపు బొలెరో నియో లభించనున్నది.
ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. 1.5 లీటర్ల ఎంహాక్75 డీజిల్ ఇంజిన్త తయారైన ఈ వాహనంలో 17.8 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర ఆధునిక ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.