చెన్నై: బీఎఫ్ఐ కప్‌లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల 55-60కిలోల కేటగిరీలో హుసాముద్దీన్ 5-0తో మితేశ్ దేశ్వాల్(రైల్వేస్)పై అలవోక విజయం సాధించాడు. బౌట్లో మొదటి నుంచే దూకుడు కనబరిచిన హుసాముద్దీన్..ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు.
ఓవైపు పంచ్‌లకు తోడు జాబ్స్, హుక్స్‌తో మితేశ్పై ముప్పేట దాడికి పాల్పడ్డాడు. మరోవైపు అంక్షిత బొరో, అరుంధతి చౌదరి పసిడి పతకాలతో మెరిశారు. మహిళల 60-65కిలోల ఫైనల్లో అంక్షిత(అసోం) 3-2తో పార్వతి గ్రెవాల్(రాజస్థాన్)పై అద్భుత విజయం సాధించింది. 65-70కిలోల తుది పోరులో అరుంధతి(సర్వీసెస్) 5-0తో స్నేహ(ఏఐపీ)పై గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. మిగతా విభాగాలో ప్రియ, నివేదిత, భావన శర్మ, సవిత, కుశియాదవ్, దివ్య పవార్, ముస్కాన్ ఆకట్టుకున్నారు.