Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ (Bus Driver)ను ఓ మహిళ నడిరోడ్డుపై చితకబాదింది. తన ఫోన్‌కు అశ్లీల వీడియోలు పంపాడని ఆరోపిస్తూ చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. సింధుదుర్గ్ (Sindhudurg) జిల్లాకు చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం కంకవ్లి (Kankavli)లోని ఓ ప్రైవేట్ ట్రావెల్ కంపెనీ కార్యాలయం ద్వారా టికెట్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత కూడా కంకవ్లి-ముంబై మధ్య అనేక సార్లు ఈ కంపెనీకి చెందిన బస్సు సర్వీసులనే ఉపయోగించేది. దీంతో ఆమె కాంటాక్ట్ నంబర్ ఆ కంపెనీ బుకింగ్ రికార్డ్స్‌లో నమోదైంది (ticket booking record). ఈ క్రమంలో బుకింగ్ రికార్డ్స్ నుంచి ఆ మహిళ ఫోన్ నంబర్ తీసుకున్న డ్రైవర్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఆమెకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధించసాగాడు. మహిళ పదేపదే హెచ్చరించినప్పటికీ సదరు డ్రైవర్ తీరులో మార్పు రాలేదు. దీంతో సహనం కోల్పోయిన బాధితురాలు.. ఈనెల 16న సాయంత్రం మరో మహిళతో కలిసి కంకవ్లి బస్ స్టాండ్ సమీపంలోని కంపెనీ బుకింగ్ కార్యాలయం వద్దకు వచ్చింది. అక్కడ వేధింపులకు గురిచేస్తున్న డ్రైవర్‌ను గుర్తించి అతడు పంపిన మెసేజ్‌లను చూపిస్తూ చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#Maharashtra : बस चालक मोबाइल पर भेजता था अश्लील वीडियो !
अश्लील वीडियो भेजने पर गुस्साई महिलाओं ने बस चालक को जड़े थप्पड़. टिकट बुकिंग रिकॉर्ड से नंबर ढूंढकर उसपर भेजता था अश्लील वीडियो !
ऐसे समाजकंटकों का तो अच्छे से ईलाज होना चाहिए @DGPMaharashtra#ProofOfFortification pic.twitter.com/RyRgwp67fP
— RKS (@BadmashChora_) September 18, 2025
Also Read..
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధానితో మాట్లాడిన మోదీ.. శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ