Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ఆ రేంజ్‌కు తగ్గట్లే ఉంటుంది. ఎక్కడా ఆమె వైభవం తగ్గదు. రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ ఆమె. ఈవెంట్లకు తగ్గట్టు కట్టూబొట్టుతో ఆకట్టుకుంటుంటారు. పూజా, వివాహాది కార్యక్రమాలకు సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చే నీతా.. బిజినెస్ ఈవెంట్లలో అందుకు తగ్గట్టు దుస్తులను ధరిస్తుంటారు. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు తీసిపోని రీతిలో ఫ్యాషన్‌ను ప్రదర్శిస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్యన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood). ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ముంబైలో ప్రీమియర్‌ను ప్రదర్శించారు మేకర్స్. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటూ అపర కుబేరుడు ముకేశ్ దంపతులు, తదితర రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నీతా అంబానీ తన స్టైలిష్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రీన్ శారీలో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్లో భర్త ముకేశ్ అంబానీతో కలిసి నీతా ఫొటోలకు ఫోజులిచ్చారు. ముకేశ్-నీతా దంపతులతోపాటూ వారి పిల్లలు, కోడళ్లు కూడా ఈ స్పెషల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Mukesh Ambani, Nita Ambani grace ‘The Ba***ds of Bollywood’ premiere; Akash-Shloka, Radhika Merchant join in
Read @ANI Story | https://t.co/8Gk9sQJxP4#Ambanifamily #MukeshAmbani #NitaAmbani #TheBadsofBollywoodpremiere #AryanKhan pic.twitter.com/F8PmLRoFZs
— ANI Digital (@ani_digital) September 17, 2025
Also Read..
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధానితో మాట్లాడిన మోదీ.. శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ
Sabarimala idols | శబరిమల ఆలయంలో 4.54 కిలోల బంగారం మాయం.. దర్యాప్తునకు ఆదేశించిన కేరళ హైకోర్టు
Delivery Agent | థార్ కారులో ఎంట్రీ ఇచ్చిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. షాకైన కస్టమర్.. VIDEO