PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధానితో మాట్లాడిన మోదీ.. శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM) జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో సంభాషించారు.
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM) జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో సంభాషించారు. ఇటీవలే ఆ దేశంలో జరిగిన ఘర్షణల్లో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్‌లో శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘గత వారం జరిగిన అవినీతి వ్యతిరేక నిరసనల నేపథ్యంలో నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కర్కితో మాట్లాడాను. ఘర్షణల్లో జరిగిన ప్రాణ నష్టంపై సంతాపం వ్యక్తం చేశాను. నేపాల్‌లో శాంతి స్థాపన, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చాను’ అని ప్రధాన మంత్రి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అదేవిధంగా రేపు నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీల కర్కి, నేపాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధాని వెల్లడించారు.
Had a warm conversation with Mrs. Sushila Karki, Prime Minister of the Interim Government of Nepal. Conveyed heartfelt condolences on the recent tragic loss of lives and reaffirmed India’s steadfast support for her efforts to restore peace and stability. Also, I extended warm…
— Narendra Modi (@narendramodi) September 18, 2025
రాజకీయ నేతల అవినీతి, సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై జడ్ జడ్ నిరసనకారులు నేపాల్‌లో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మంది వరకూ గాయపడ్డారు. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. జన్ జడ్ ప్రతినిధుల బృందం నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ (Sushila Karki) పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read..
Rahul Gandhi: ఓటు దొంగలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు: రాహుల్ గాంధీ
Sabarimala idols | శబరిమల ఆలయంలో 4.54 కిలోల బంగారం మాయం.. దర్యాప్తునకు ఆదేశించిన కేరళ హైకోర్టు
Delivery Agent | థార్ కారులో ఎంట్రీ ఇచ్చిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. షాకైన కస్టమర్.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

