న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీతో భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిని ఎన్నికల సంఘం రక్షిస్తోందని విమర్శించారు. భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఆయన నేరుగా ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని సీఈసీ రక్షిస్తున్నట్లు తెలిపారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని, తన వద్ద వంద శాతం ఆధారాలు ఉన్నాయని, ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తి అని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తానన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమిస్తానన్నారు. ఆ వ్యవస్థలను రక్షిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇదేమీ హైడ్రోజన్ బాంబు కాదు అని, అది తర్వాత పేలుతుందన్నారు.
కర్నాటకలోని కాలబుర్గి జిల్లాలో ఉన్న అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు జాబితా నుంచి డిలీట్ అయ్యాయని, సాఫ్ట్వేర్ మానిప్యులేషన్, ఫేక్ అప్లికేషన్లతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు రాహుల్ ఆరోపించారు. ఓటర్లకు తెలియకుండానే తమ ఓట్ల వివరాలను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇక మహారాష్ట్రలోని రాజ్‌పురా నియోజకవర్గంలో సుమారు 6850 ఓట్లను కొత్తగా జోడించినట్లు చెప్పారు. నకిలీ పేర్లు, అడ్రస్‌లతో ఓటర్లను జోడించి, బోగస్ ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు ఆరోపించారు. సెంట్రలైజ్డ్ సాఫ్ట్‌వేర్‌తో ఓట్లను డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. ఓ కాల్ సెంటర్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు రాహుల్ ఆరోపించారు.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, “The Chief Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy.” pic.twitter.com/1U4aRq6ooT
— ANI (@ANI) September 18, 2025