Sabarimala idols | కేరళలోని శబరిమల ఆలయం (Sabarimala temple)లో గల ద్వారపాలక విగ్రహాలపై (Dwarapalaka idols) బంగారు పూత పూసిన రాగి పలకలను మరమ్మతుల కోసం పంపించిన వ్యవహారం తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ రాగి పలకల నుంచి కొంత బంగారం తగ్గడంపై (gold missing) కేరళ హైకోర్టు (Kerala High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్యాప్తునకు ఆదేశించింది.
2019లో ద్వారపాలకుల విగ్రహాలకు (Dwarapalaka idols) ఉన్న బంగారు పూత పూసిన రాగి పలకలను తాపడం కోసం తొలగించారు. అప్పుడు వాటి బరువు 42.8 కిలోలు. మరమ్మతుల కోసం చెన్నైకి చెందిన సంస్థకు అప్పగించేసరికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. దాదాపు 4.54 కిలోల మేర వ్యత్యాసం వచ్చింది. ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం అని పేర్కొంది. దీనిపై వివరణాత్మక విచారణ అవసరమని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. 2019లో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు మరమ్మతులు చర్యలు చేపట్టింది. అయితే, వారు స్పెషల్ కమిషనర్‌కు గానీ, కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ బంగారు రేకులను తొలగించడం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
Also Read..
Delivery Agent | థార్ కారులో ఎంట్రీ ఇచ్చిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. షాకైన కస్టమర్.. VIDEO
Pak-Saudi defence pact | పాక్-సౌదీ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. భారత్ ఏమన్నదంటే..?
Bihar Assembly Elections: 3 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు !