Maganti Sunitha | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్రావు నగర్ డివిజన్లో ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, స్వర్గీయ గోపన్న హయాంలో డివిజన్లో జరిగినటువంటి పెండింగ్ పనులపై ఆరా తీశారు. అలాగే పరిశుభ్రత కార్మికులు చేస్తున్న కృషిని గుర్తించి వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్థానిక హోటల్‌ను సందర్శించి స్వయంగా దోసెలు వేసి కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేశారు. అదే విధంగా స్థానిక దేవాలయాలను కూడా దర్శించారు.
ఈ కార్యక్రమంలో వెంగళ్రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదిప్యా రావు, మాజీ కార్పొరేటర్ శ్యాం ముదిరాజ్, నాయకులు విజయ్ ముదిరాజ్, వేణు, ఆంజనేయులు యాదవ్, పూజారి బాలరాజ్, బంటి యాదవ్, పవన్ ముదిరాజ్, గజ్జల బాలకృష్ణ, అజ్జు బాయ్, అంబటి రామకృష్ణ విజయ గౌడ్, కట్ట లక్ష్మి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.