Bike Stunt | ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ (Shoot Reel) నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ వ్యక్తి బైక్‌పై విన్యాసాలు (Bike Stunt) ప్రదర్శించి చిక్కుల్లో పడ్డాడు.
బిజ్నోర్ జాతీయ రహదారి (Bijnor Highway)పై ఓ వ్యక్తి హై స్పీడ్ స్పోర్ట్స్ బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. బైక్ సీటుపై నిలబడి సాహసోపేత విన్యాసాలు ప్రదర్శించాడు. మరో వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోపై మీరట్ పోలీసులు (Meerut Police) కూడా స్పందించారు. ఈ మేరకు రైడర్‌పై చర్యలు చేపట్టారు. రైడర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
मेरठ में अपनी हरकतों से बाज नहीं आ रहे स्टंटबाज!
मेरठ-बिजनौर नेशनल हाईवे पर युवक का जानलेवा स्टंट का वीडियो सोशल मीडिया पर वायरल। भैंसी टोल प्लाजा के पास बताई जा रही घटना…#UttarPradesh #Meerut #MeerutPolice #Stunt #BikeStunt #UPPolice #ViralVideo #LatestNews #Nedricknews… pic.twitter.com/NorR8sMuHz— Nedrick News (@nedricknews) September 16, 2025
Also Read..
High Court | ఆ వీడియోను వెంటనే తొలగించండి.. కాంగ్రెస్‌కు పాట్నా హైకోర్టు ఆదేశాలు
PM Modi | మోదీ బర్త్‌డే.. 750 తామర పువ్వులతో పూరీ తీరంలో ప్రత్యేక సైకత శిల్పం