High Court | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లి దివంగత హీరాబెన్ మోదీ (Heeraben Modi)పై కాంగ్రెస్ ఏఐ వీడియో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వీడియో తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనిపై బీహార్లో హస్తం పార్టీపై కేసు కూడా నమోదైంది. ఈ కేసును పాట్నా హైకోర్టు (Patna High Court) తాజాగా విచారించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలను వెంటనే తొలగించాలని హస్తం పార్టీని కోర్టు ఆదేశించింది.
ప్రధాని మోదీకి ఆయన తల్లి హీరాబెన్ మోదీ కలలోకి వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ఏఐ వీడియో రూపొందించిన విషయం తెలిసిందే. ‘సాహబ్ కలలోకి అమ్మ వచ్చింది’ (Maa appears in Sahabs dreams) అనే శీర్షికతో బీహార్ కాంగ్రెస్ 36 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మనోభావాలను గాయపరచేందుకు ఉద్దేశించిన వీడియోగా దీనిపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేసింది.
Also Read..
Asaduddin Owaisi | ముస్లింలు ఇండియాలో ఉండటమే వారికి సమస్య.. బీజేపీ మత విద్వేషం వీడియోపై ఒవైసీ ఆగ్రహం
PM Modi | ప్రధాని మోదీకి బర్త్డే విషెస్ తెలిపిన రాహుల్, ఖర్గే