Georgia | అర్మేనియా (Armenia)-జార్జియా (Georgia) సరిహద్దుల్లో భారతీయ పర్యాటకులకు (Indian Tourist) ఘోర అవమానం జరిగింది. దేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 56 మంది భారతీయులతో కూడిన బృందం పట్ల జార్జియన్ అధికారులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. సరైన పత్రాలు, ఈ-వీసాలు ఉన్నప్పటికీ వారిని అడ్డుకున్నారు. ఈ మేరకు అక్కడ తమకు ఎదురైన చేతు అనుభవాన్ని ధృవీ పటేల్ అనే మహిళ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు.
తమ పట్ల జార్జియన్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, తమని పశువుల్లా ఫుట్‌పాత్‌పైనే నిల్చో బెట్టారని ఆరోపించారు. ఆర్మేనియా, జార్జియా మధ్య ఉన్న సదఖ్లో సరిహద్దు వద్ద తమ బృందాన్ని ఐదు గంటలకు పైగా గడ్డకట్టే చలిలో నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆహారం గానీ, టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా తమ పాస్‌పోర్ట్‌లను సైతం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అన్ని సరైన పత్రాలు ఉన్నప్పటికీ సరిహద్దుల్లో నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు. అక్కడి అధికారులు తమను నేరస్థుల్లా చూసి వీడియోలను కూడా తీశారని తెలిపారు. కానీ తాము వీడియో తీయకుండా అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లకు తన పోస్టును ట్యాగ్ చేశారు.
Also Read..
PM Modi | ప్రధాని మోదీకి బర్త్‌డే విషెస్ తెలిపిన రాహుల్, ఖర్గే
Asaduddin Owaisi | ముస్లింలు ఇండియాలో ఉండటమే వారికి సమస్య.. బీజేపీ మత విద్వేషం వీడియోపై ఒవైసీ ఆగ్రహం