PM Modi | నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. వారితోపాటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర దేశాధినేతలు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రముఖ సైకత శిల్పి (sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సైతం ప్రధానికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ సాగర తీరంలో (Puri Beach) ప్రత్యేకంగా ఇసుకతో సైకత శిల్పం రూపొందించారు. మోదీ ఫొటోతో ‘భారత్ కీ ఉడాన్ మోదీ జీ కే సాథ్’ అనే సందేశంతో ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పాన్ని 750 తామర పువ్వుల (lotus flowers)తో అలంకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సుదర్శన్ పట్నాయక్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
On the occasion of the 75th birthday of our Hon’ble Prime Minister Shri Narendra Modi ji, My Sand Art Installation with 750 Lotus Flowers with message “Bharat ki Udaan Modi ji Ke Saath “ at Puri Beach in Odisha.#HappyBdayPMModi pic.twitter.com/n7TgErK7bl
— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2025
Also Read..
PM Modi | ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
Heavy Rains | హిమాచల్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. 18 మంది మృతి
SBI | సైనిక దుస్తుల్లో వచ్చి.. బ్యాంకును దోచుకున్న దొంగల ముఠా