SBI | కర్ణాటక (Karnataka)లో దొంగలు బీభత్సం సృష్టించారు. విజయపుర (Vijayapura) జిల్లా చడచన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ (SBI branch)లో పట్టపగలే దొంగల ముఠా దోపిడీకి పాల్పడింది (Armed gang loot). సైనిక దుస్తుల్లో ముసుగులు ధరించిన ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ప్రవేశించారు. దేశీయ పిస్టోళ్లు, పదునైన ఆయుధాలతో బ్యాంక్‌లోకి ప్రవేశించిన ముఠా.. బ్యాంకు మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని ఓ చోట బంధించింది. అనంతరం బంగారు ఆభరణాలు, కొంత మొత్తంలో నగదు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే ఎంత మొత్తంలో దోపిడీకి గురైందన్నది ఇంకా తెలియరాలేదు. దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయాక బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Love Swap | భార్య చెల్లితో భర్త పరార్.. బావ సోదరితో బామ్మర్ది జంప్
Modi Birthday | ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్
Diabetes | ధూమపానంతో టైప్-2 డయాబెటిస్!