న్యూఢిల్లీ : ధూమపానం టైప్-2 డయాబెటిస్‌కు కారణం కావొచ్చని కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం పొగ తాగడం టైప్-2 డయాబెటిస్లోని నాలుగు ఉప రకాల అభివృద్ధిని పెంపొందిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, ఇన్సులిన్ లోటు, ఊబకాయం, వయసు తదితరాలు మధుమేహానికి కారణాలైనప్పటికీ పొగ తాగడం ఆ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు.
3,325 మంది డయాబెటిస్ రోగులు, 3,897 మంది డయాబెటిస్ లేని ప్రజల డాటాను పరిశీలించి ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. దీని ప్రకారం టైప్-2 డయాబెటిస్ ఉప రకాలు పొగ తాగని వారితో పోలిస్తే పొగ తాగే వారిలో 2.15 రెట్లు ఎక్కువ వచ్చే ముప్పు ఉన్నది.