Love Swap | లక్నో : ఓ వ్యక్తి తన భార్య చెల్లితో పరార్ కాగా, బావ సోదరితో బామ్మర్ది జంప్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలి జిల్లాలోని కమలుపూర్ గ్రామానికి చెందిన కేశవ కుమార్(28)కు ఆరేండ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆగస్టు 23వ తేదీన కేశవ కుమార్ తన భార్య చెల్లెలు కల్పనతో పారిపోయాడు. ఆ మరుసటి రోజే.. భార్య సోదరుడు రవీంద్ర(22) బావ కేశవ కుమార్ సోదరి(19)తో లేచిపోయాడు.
ఈ ఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు, గ్రామస్తులు షాక్ అయ్యారు. మొత్తానికి ఈ జంటలను పోలీసులు గుర్తించి సెప్టెంబర్ 15వ తేదీన పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు సమస్యను పరిష్కరించారు. కేశవ కుమార్ కల్పనను విడిచిపెట్టేందుకు అంగీకరించగా, బామ్మర్ది కూడా కుమార్ సోదరిని విడిచిపెట్టేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాలతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది.