Heavy Rains |ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తిన విషయం తెలిసిందే. రాజధాని డెహ్రాడూన్ దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో వరదలు సంభవించాయి. సహస్త్రధారలో మంగళవారం వచ్చిన ఆకస్మిక వరదలకు హోటళ్లు, దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా వాణిజ్య సంస్థలు, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగింది. ఈ వరదలకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అటు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. మండి (Mandi) జిల్లాలో కురిసిన కుంభవృష్టికి జనజీవనం స్తంభించిపోయింది. అనేక నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాలకు జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి అంటే జూన్ 20 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 417 మంది మరణించారు. 45 మంది గల్లంతయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి 16 మధ్య హిమాచల్లో 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నేడు ఐదు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read..
SBI | సైనిక దుస్తుల్లో వచ్చి.. బ్యాంకును దోచుకున్న దొంగల ముఠా
Love Swap | భార్య చెల్లితో భర్త పరార్.. బావ సోదరితో బామ్మర్ది జంప్
Modi Birthday | ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్