Anurag Thakur | దేశంలో ఓట్ చోరీ (vote chori) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం సాయంతో ఓట్ల చోరీకి పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ, ఈసీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీతో భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిని ఎన్నికల సంఘం రక్షిస్తోందని విమర్శించారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
రాహుల్ తన నిరాధారమైన ఆరోపణలతో దేశంలో బంగ్లాదేశ్, నేపాల్ (Nepal) తరహా పరిస్థితులను సృష్టించాలనుకుంటున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thaku) విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం పక్షపాతం లేకుండా పనిచేస్తుంటే.. రాహుల్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు. దేశంలో బంగ్లాదేశ్, నేపాల్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
‘రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో ఆయనలో నిరాశ రోజురోజుకూ పెరుగిపోతోంది. అలాగే గెలుపుపై రాహుల్ గాంధీకి నమ్మకం పోయింది. ఆరోపణల రాజకీయాలను రాహుల్ తన అస్త్రంగా మార్చుకున్నారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. క్షమాపణ కోరడం, కోర్టుల నుంచి మందలింపులు పొందడం రాహుల్కు నిత్యకృత్యంగా మారింది’ అని ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
Also Read..
Election Commission of India: ఆన్లైన్లో ఓట్లను డిలీట్ చేయలేం: కేంద్ర ఎన్నికల సంఘం
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధానితో మాట్లాడిన మోదీ.. శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ