న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, అబద్ధమని ఈసీ పేర్కొన్నది. ఓట్లను ఆన్లైన్ డిలీట్ చేయలేరని ఎన్నికల సంఘం చెప్పింది. ఆన్లైన్ పద్ధతిలో ప్రజలు ఓట్లను డిలీట్ చేయడం కుదరదని, రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధిత వ్యక్తి విజ్ఞాపన విన్న తర్వాతనే డిలీట్ ప్రక్రియ జరుగుతుందని ఈసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
కర్నాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు డిలీట్ అయినట్లు రాహుల్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందిస్తూ.. ఆ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను 2023లో ఈసీనే బయటపెట్టినట్లు పేర్కొన్నది. ఓటర్ల తొలగింపు కోసం ప్రయత్నాలు జరిగాయని, ఈ ఘటన పట్ల ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈసీ తన స్టేట్మెంట్లో తెలిపింది.
అలంద్ నియోజకవర్గ సీటును 2018లో బీజేపీ అభ్యర్థి సుబద్ గుత్తేదార్, 2023లో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ పాటిల్ గెలిచినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను రాహుల్ టార్గెట్ చేయడం దురదృష్టకరమని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. జ్ఞానేశ్ కుమార్ ఆర్నెళ్ల క్రితం సీఈసీగా బాధ్యతలు చేపట్టారని, కానీ ఏడాది క్రితం అక్రమాలు జరిగినట్లు రాహుల్ ఆరోపించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.
❌Allegations made by Shri Rahul Gandhi are incorrect and baseless.#ECIFactCheck
✅Read in detail in the image attached 👇 https://t.co/mhuUtciMTF pic.twitter.com/n30Jn6AeCr
— Election Commission of India (@ECISVEEP) September 18, 2025