పాలకుర్తి, సెప్టెంబర్ 3 : బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని మరవకూడదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుడు బానోత్ మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన తీజ్ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ బంజారాల కట్టు, బొట్టు అందంగా ఉంటుందన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో బంజారాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, అందుకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావుతో కేసులు వేయించాడని మండిపడ్డారు. వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేవంత్‌ను డిమాండ్ చేశారు. లంబాడీల మీద కోపంతోనే రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఇప్పటి వరకు చోటు కల్పించలేదన్నారు. తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. హైదరాబాద్‌లో 5 ఎకరాల్లో బంజారా భవన్ నిర్మించామన్నారు.
పాలకుర్తిలో తాను మంత్రిగా ఉన్నప్పుడు సేవాలాల్ భవనానికి రూ. 4 కోట్లు మంజూరు చేశానన్నారు. పాలకుర్తికి ఓ ప్రత్యేక చరిత్ర ఉందని, మహా కవులను కన్న పుణ్యభూమి అన్నారు. పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులను పోలీసులు వేధింపులకు గురి చేయడం తగదని, వారు తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, నాయకులు కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో ప్రజలు మోసపోయారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, పాకనాటి సునీల్‌రెడ్డి, పుస్కూరి శ్రీనివాస్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, జర్పుల బాలునాయక్, లకావత్ సురేశ్, వెంకట్, నాగరాజు, దీకొండ వెంకటేశ్వర్రావు, భూక్యా శ్రీనివాస్, జై సింగ్, రాంసింగ్ నాయక్, గర్వందుల మల్లేశ్, ధరావత్ మహేశ్, గాంధీనాయక్, మాచర్ల ఎల్లయ్య, ధరావత్ యాకూబ్‌నాయక్, బానోత్ మహేందర్, బాలునాయక్, దేవేందర్, భూక్యా తిరుపతి, గిరిజనులు పాల్గొన్నారు. కాగా, గిరిజన గాయకుడు బిక్షునాయక్ పాటలు అలరించాయి.