Swetha Naagu | సాధారణంగా ఇంటర్నెట్లో వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా శ్వేతనాగు వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. తమిళనాడులోని నైవేలీ బొగ్గు గనుల్లో శ్వేతనాగు కనిపించగా.. పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం వీడియో కనిపించిన పామును చూసి అందరూ షాక్ అవుతుతున్నారు. వీడియో ప్రకారం.. తెల్లటిగా ఈ పాము 15 అడుగుల పొడవు ఉండగా.. నల్లటి గనుల్లో సంచరిస్తూ కనిపించింది. కొందరు కార్మికులు ఆ పామును చూసి తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. ఈ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో అది అక్కడి నుంచి దారితప్పి గనుల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
బహుశా వాతావరణ మార్పులు, ఆహారం కోసం వెతుకుతూ గనుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్లు మాత్రం ఈ వీడియోను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద పాము చూసింది ఇదే మొదటిసారి అని.. కొందరు.. చాలా డేంజరస్‌గా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. గతంలోనూ ఇలాంటి శ్వేతనాగు కర్నాటకలోనూ కనిపించాయి. షిమోగా తాలుక రామేనకొప్ప గ్రామంలో ఓ తోటలు శ్వేతనాగు కనిపించింది. మూడున్నర అడుగుల పొడువు ఉన్న నాగుపామును స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దానికి కంటే నాలుగేళ్ల ముందు ఇలాంటి శ్వేతనాగు ఒకటి కనిపించింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. చర్మ, రక్త సంబంధిత కారణాలతో తెలుపు రంగులోనూ కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.