Droupadi Murmu : దక్షిణాదిలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మైసూర్‌లోని అలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIICH) డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, ప్రెసిడెంట్ ముర్ము మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాష్ట్రపతిని ఆయన ‘మీకు కన్నడ తెలుసా?’ అని అడిగారు. అందుకు నవ్వుతూ ‘లేదు’ అని సమాధానమిచ్చారు ప్రెసిడెంట్.
మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ద్రౌపది ముర్ము మైసూర్ విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్, సీఎం సిద్ధరామయ్య ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏఐఐఎస్‌హెచ్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు ముర్ము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కన్నడలో ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం రాష్ట్రపతి వైపు చూసి నవ్వుతూ మీకు కన్నడ తెలుసా? అని అడిగారు.
Siddaramaiah: You Know Kannada ಅಂತಾ ಸಿದ್ರಾಮಯ್ಯ ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ರಾಷ್ಟ್ರಪತಿ ಮುರ್ಮು ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದೇಗೆ ನೋಡಿ |#TV9D
#Tv9kannada #PresidentDraupadiMurmu #Mysore #Murmu #MandakalliAirport #PresidentMurmu #Siddaramaiah #VajraMahotsav #AllIndiaSpeechandHearingInstitute… pic.twitter.com/puM8UiC4oW— TV9 Kannada (@tv9kannada) September 1, 2025
అందుకు ముర్ము నవ్వుతూ.. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నా మాతృభాష కన్నడ కాదని తెలియజేస్తున్నా. అయితే.. నాకు దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు, పద్ధతులను ఇష్టపడుతాను. ప్రతి భాష పట్ల నాకెంతో గౌరవం ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ మాతృభాషను బతికించుకునేందుకు పాటుపడుతుంటారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను తమ పిల్లలకు వారసత్వంగా నేర్పిస్తారు. అలా చేస్తున్నందుకు అందరికీ నా అభినందనలు. ఇక కన్నడ విసయానికొస్తే.. కచ్చితంగా నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాను’ అని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మంత్రులు, సీనియర్ నాయకులు, బీజేపీ ఎంపీ యుధ్వీర్ వడియార్, మైసూర్ రాజు వంశస్థులు పాల్గొన్నారు.